కామారెడ్డి, ఏప్రిల్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
భారత రత్న బాబా సాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ ఆశయ సాధన కోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తుందని, ఎస్సీ వర్గీకరణతో మూడు దశాబ్దాల పోరాట ఆకాంక్షలు నెరవేర్చడమేనని అదనపు కలెక్టర్ చందర్ నాయక్ అన్నారు. సోమవారం డా. బి ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా కామారెడ్డి మున్సిపల్ పరిధి కేంద్రంలో జిల్లా అదనపు కలెక్టర్ చందర్ నాయక్ జిల్లా గ్రంధాలయ శాఖ చంద్రకాంత్ రెడ్డి తో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు.
అనంతరం షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవ కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలతో అలంకరించి జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేసి, ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలన్నారు.
అందరికీ న్యాయం జరిగేలా అంబేద్కర్ ఆలోచనల స్పూర్తితో ముందుకు సాగుతున్నారని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే నేడు తాము రిజర్వేషన్ ఫలాలు పదవులను అనుభవిస్తున్నామని చెప్పారు. ఆయన చూపిన మార్గంలో మనమంతా ముందుకు సాగాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారిని రజిత, ఈ.డి ఎస్ సి కార్పొరేషన్ దయానంద్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, బహుజన సంఘ నాయకులు కొత్తపల్లి మల్లయ్య, వివిధ సంఘాల నాయకులు సహాయ సంక్షేమ అధికారి వెంకటేష్, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ సంక్షేమ అధికారులు, కళాజాత బృందం పాల్గొన్నారు.