ఆర్మూర్, ఏప్రిల్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పొద్దుటూరి వినయ్ ఆదేశాల మేరకు మంగళవారం నందిపేట్ మండలం షాపూర్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం బొంతల చిన్నయ్యకి రూ. 87 వేలు, నీరది బోజమ్మకి రూ. 60 వేలు, నందిపేట్ మండల కేంద్రానికి చెందిన దేవగౌడ్ కి రూ. 24 వేలు సీఎం సహాయనిధి చెక్కులను కాంగ్రెస్ పార్టీ మండల్ అధ్యక్షులు మంద మహిపాల్ అందజేశారు. కార్యక్రమంలో నాయకులు కదిర్, కిష్టాగౌడ్, కాంతం చిన్నయ్య, పీరాజీ నాగరాజు, మన్నె సాగర్, తమ్మల్లా దేవేందర్, తిమ్ముల శివ, సంతోష్, భోజన్న తదితరులు పాల్గొన్నారు.