కామారెడ్డి, ఏప్రిల్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలను పక్కాగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం సాయంత్రం ఎంపీడీఓ, ఎంపీఒ, ఆర్డీఓ, మున్సిపల్ కమీషనర్ లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 18 నుండి 21 వరకు ఇందిరమ్మ కమిటీ సభ్యులు లబ్ధిదారులను పరిశీలించాలని, నిరుపేదలు, మట్టి ఇండ్లు, రేకుల షేడ్, గుడిసెల్లో నివసిస్తున్న వారిని గుర్తించాలని తెలిపారు.
ఈ నెల 22 నుండి 30 వరకు ఇందిరమ్మ కమిటీలు ఇచ్చిన జాబితాలోని లబ్ధిదారులు ఎంపీడీఓ లు, మున్సిపల్ కమీషనర్ లు, ఎంపిఓ లు, పంచాయతీ రాజ్, హౌసింగ్, తదితర గెజిటెడ్ అధికారులు బాధ్యతగా వెరిఫై చేయాలని అన్నారు. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇల్లు మంజూరు చేయవలసి ఉంటుందని తెలిపారు. అట్టి పరిశీలించిన జాబితాలను మే 2 వ తేదీన సంబంధిత గ్రామ పంచాయతీ/వార్డ్ లో బోర్డుపై ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు.
మే 3 నుండి 5 వరకు వెరిఫై చేసిన జాబితాను జిల్లా మంత్రి గారి ఆమోదమునకు సమర్పించాలని, అట్టి జాబితా లోని లబ్ధిదారుల వివరాలు ఆన్లైన్ లో అప్ లోడ్ చేసి, జిల్లా కలెక్టర్ గారి మంజూరు ఉత్తర్వులు పొందాలని తెలిపారు. జూమ్ కాన్ఫరెన్స్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ నాయక్, ఎంపీడీఓ లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపిఓలు, తదితరులు పాల్గొన్నారు.