కార్పొరేషన్‌ ముట్టడిరచిన మాస్టర్‌ ప్లాన్‌ బాధితులు

నిజామాబాద్‌, ఆగష్టు 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగర మాస్టర్‌ ప్లాన్‌ బాధితులు గురువారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించి మున్సిపల్‌ కార్పొరేషన్‌ను ముట్టడిరచారు. 47 సంవత్సరాల తరువాత నిజామాబాద్‌ నగరానికి రూపొందిస్తున్న మాస్టర్‌ ప్లాన్‌ ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా, పౌర సమాజంతో చర్చించకుండా, కేవలం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో కుమ్మక్కై మాస్టర్‌ ప్లాన్‌ని తయారు చేశారని దీనిలో అనేక అవకతవకలు ఉన్నాయని, వాటిని సవరించాలని కోరుతూ నిజామాబాద్‌ నగర మాస్టర్‌ ప్లాన్‌ బాధితుల కమిటీ పెద్ద ఎత్తున గురువారం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

ముఖ్యంగా వినాయక నగర్‌ నుండి గాయత్రీ నగర్‌, ఆనంద నగర్‌, చంద్రానగర్‌, వివేకానంద నగర్‌, సాయి నగర్‌, వర్ని రోడ్డు వరకు ప్రతిపాదిత 100 ఫీట్‌ రోడ్డు మార్గంలో, పేద, మధ్య తరగతి వర్గాలకు సంబంధించి వందల కుటుంబాలు ఇండ్లు నిర్మించుకున్నారని, ప్లాట్లు కొన్నారని ఈ రోడ్డు వేయటం మూలంగా వారందరూ నిరాశ్రయులు అవుతారని బాధితులు ఆరోపించారు.

1974 సంవత్సరంలో అప్పటి మాస్టర్‌ ప్లాన్‌ వినాయకనగర్‌ నుండి వర్ని రోడ్డు వరకు అక్కడ నుండి బోధన్‌ రోడ్డు వరకు 100 ఫీట్‌ రింగ్‌ రోడ్డు ప్రతిపాదించారని, ఈరోజు వరకు ఆ రోడ్డును మార్కింగ్‌ చేయడం గాని, ఆ రోడ్డులో భూ యజమానులకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని, మార్కింగ్‌ చేయలేదని, బాధితులు పేర్కొన్నారు. అయితే నూతన మాస్టర్‌ ప్లాన్‌ వినాయక నగర్‌ నుండి వర్ని రోడ్డు వరకు, అక్కడ నుండి బోధన్‌ రోడ్డు వరకు ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ ప్రాంతాల గుండా వెళ్లే వంద ఫీట్ల రోడ్డు రద్దు చేశారని, ఇది రింగ్‌ రోడ్డు ఎలా అవుతుందో మున్సిపల్‌ అధికారులు చెప్పాలని బాధితులు ప్రశ్నించారు.

అదేవిధంగా చంద్ర నగర్‌ రోడ్డు 33 ఫీట్ల వరకు ఉన్నదని, దానిని ఇప్పుడు 60 కోట్లకు పెంచారని, దీని మూలంగా దాదాపు 70 ఇండ్లుకు నష్టం వాటిల్లే విధంగా ఉందని వారు పేర్కొన్నారు. ధర్నా కార్యక్రమాన్ని సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ప్రభాకర్‌ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ముస్లిం మైనారిటీ ప్రాంతంలో ఉన్న రోడ్డును తీసేసి సగం రోడ్డు ఉంచటం ఏవిధంగా సమంజసమో ప్రభుత్వం తెలపాలని, తక్షణమే మిగిలిన సగం రోడ్డును కూడా రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

అతిథిగా హాజరైన సిపిఎం నగర కార్యదర్శి మల్యాల గోవర్ధన్‌ మాట్లాడుతూ ప్రజల సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికొదిలేసిందని, కేవలం వ్యాపారస్తులకు రియల్‌ ఎస్టేట్‌ వారికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ఆరోపించారు. ఆ తరువాత బాధితులు అందరూ మేయర్‌ నీతు కిరణ్‌ చాంబర్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. నీతూ కిరణ్‌ బాధితులతో మాట్లాడుతూ తప్పక రింగురోడ్డు బాధితులకు న్యాయం చేస్తానని ఈ విషయమై జిల్లా కలెక్టర్‌తో, ఎమ్మెల్యేతో చర్చించి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.

బాధితుల నినాదాలతో మున్సిపల్‌ కార్యాలయం మారుమ్రోగిపోయింది. ధర్నా కార్యక్రమానికి బాధితుల కమిటీ కన్వీనర్‌ కె రామ్మోహన్‌ రావు అధ్యక్షత వహించారు. ఇంకా కార్యక్రమంలో బాధిత కమిటీ కో- కన్వీనర్‌ వి. గోదావరి, సంతోష్‌, రాములు, రాజు, రాధాకృష్ణ, భూలక్ష్మి, సతీష్‌, రామ్‌చందర్‌, భాస్కర్‌, శంకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »