హైదరాబాద్, ఏప్రిల్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణలో క్యాన్సర్ కేసులు పెరుగుతుండడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.
అన్ని గ్రామాల్లో 18 ఏళ్లు దాటిన వారందరికీ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తామని అధికారులు వెల్లడిరచారు. ఈ పరీక్షల్లో ఎవరిలోనైనా క్యాన్సర్ లక్షణాలు బయటపడితే.. జిల్లాస్థాయి క్యాన్సర్ చికిత్స కేంద్రానికి తరలిస్తారు.