కామారెడ్డి, ఏప్రిల్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై ముంతాజ్ బేగంకు బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో పట్టణానికి చెందిన ఎర్రం ఈశ్వర్ మానవతా దృక్పథంతో స్పందించి 14 వ సారి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచారని, ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ వేసవి కాలం కావడం వలన రక్తనిధి కేంద్రాలలో నిల్వలు లేకపోవడంతో వివిధ చికిత్సల నిమిత్తమై వచ్చిన వారికి రక్తం దొరకడం లేదని అలాంటి వారికి రక్తాన్ని అందజేయాల్సిన ప్రతి ఒక్కరి పైన ఉందని అన్నారు. రక్తదానం వలన ఎలాంటి బలహీనతలు ఏర్పడవని, అపోహలను విడనాడి రక్తదానానికి ముందుకు రావాలని అన్నారు. రక్తదాత ఎర్రం ఈశ్వర్‌కు ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అభినందనలు తెలిపారు.