కామరెడ్డి, ఏప్రిల్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో జ్యోతికి ఆపరేషన్ నిమిత్తమై ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో దోమకొండ మండల కేంద్రానికి చెందిన ఇంజీరింగ్ విద్యార్థి దీకొండ రోహిత్ అశ్వత్ మానవతా దృక్పథంతో స్పందించి వెంటనే సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణదాతగా నిలిచారని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.
యువత రక్తదానం పట్ల ఉన్న అపోహలను విడనాడాలని ఆపదలో ఉన్నవారికి రక్తాన్ని అందజేసి ప్రాణదాతలు కావాలని విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛందంగా రక్తదానం చేయాలనుకున్నవారు వారి యొక్క వివరాలను 9492874006 నెంబర్ కు తెలియజేయాలని అన్నారు.