నిజామాబాద్, ఏప్రిల్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు నిర్వహించారు. కలెక్టరేట్లో ఐడిఓసి సమావేశ మందిరములో నిర్వహించిన వేడుకలకు అదనపు కలెక్టర్ అంకిత్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆ మహనీయుని ఆశయాలకు అనుగుణంగా సామాన్యులకు ఫలాలు అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి బి. స్రవంతి, జిల్లా సహాయ వెబత అభివృద్ధి అధికారి పి. నర్సయ్య, సి గంగాధర్, లింగాయత్ వర్గం నుండి వి. చంద్రశేఖర్, యల్. బసవన్న, బి. రాజ్‌కుమార్, బుస్స అంజనేయులు, మాయావర్ రాజేశ్వర్ తదితర బిసి నాయకులు వసతి గృహ సంక్షేమాధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.