మాక్లూర్, మే 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
గురువారం సాయంత్రం డీకంపల్లి గ్రామానికి చెందిన గౌరీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే… డీకంపల్లి గ్రామానికి చెందిన సాయినాథ్ అతని భార్య గౌరీ (39) బైక్‌పై బోధన్ బంధువుల అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో గొట్టిముక్కల గ్రామం దాటిన తర్వాత బీటీ రోడ్డు మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని వాహనం డీ ఢీకొనగా సాయినాథ్ భార్య గౌరీ బండి పైనుంచి కింద పడిరది.
ఆమె పైనుంచి గుర్తు తెలియని వాహనం వెళ్ళగా ఆమె తలకు తీవ్ర గాయాలవగా అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.