ఆర్మూర్, మే 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆలూరు మండలంలో ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాల్లో అగ్రస్థానాల్లో నిలిచిన విద్యార్థులు సుప్రియ, ధనిక్, సంజన, హర్షిత, రజిని మండల టాపర్లుగా రాణించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముక్కెర విజయ్ విద్యార్థులకు సన్మానించి ప్రతి ఒక్కరికి నగదు పురస్కారాలను అందజేశారు.
ఈ సందర్భంగా ముక్కెర విజయ్ మాట్లాడుతూ, విద్యార్థులు కష్టపడి చదివి తమ భవిష్యత్‌ను వెలుగుల్లోకి తీసుకురావాలన్నారు. వారికి అవసరమైన సహాయం చేయడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్, ఎంఈఓ నరేందర్, ఆర్ఐ రేణుక, విడిసి అధ్యక్షుడు బార్ల ముత్యం, సంజీవ్, టాపర్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.