కామారెడ్డి, ఆగష్టు 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో తెలంగాణ జాతిపిత ఆచార్య జయశంకర్ జయంతిని కామారెడ్డిలో నిర్వహించారు. ఈ సందర్బంగా తెరవే జిల్లా అధ్యక్షులు గఫుర్ శిక్షక్ మాట్లాడుతూ జాతిపిత జయశంకర్ ఆశించిన స్వేచ్చాయుత తెలంగాణ సాధించాలన్నారు.
సమస్యల సాధనలో అందరూ ముందుండాలని, తెలంగాణను అప్పుల తెలంగాణ కాకుండా చూడాలన్నారు. సమస్యలను పరిష్కరించుకుంటు ముందుకు వెళ్లాలన్నారు. కార్యక్రమంలో తెరవే జిల్లా ఉపాధ్యక్షులు మంద పీతాంబర్, నాగభూషణం, గంగాప్రసాద్, ఎంబారి లింగం, కాసర్ల రాంచంద్రం పాల్గొన్నారు.