నిజామాబాద్, మే 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కేంద్ర ప్రభుత్వ పథకం కింద జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక రంగాల పనితీరును మెరుగుపరిచేందుకు జిల్లా పరిశ్రమల కేంద్రంలో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం అంతర్జాలంలో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ కె.సురేష్ కుమార్ ఒక ప్రకటనలో సూచించారు. ఇందులో భాగంగా జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంస్థ జిల్లాకు ఈడీసీ మేనేజర్, ఈడీసీ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను కేటాయించడం జరిగిందని ఆయన తెలిపారు.
పోస్టులను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరడం జరుగుతుందన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు మే, 10వ తేదీని చివరి తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు. అభ్యర్థులు ఇతర వివరాలకు వెబ్‌సైట్ ను సంప్రదించాలని, ఇతర వివరాలకు సెల్ నెంబర్ 9640909831 ను సంప్రదించాలని సూచించారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు గడువు లోపు పైన పేర్కొన్న http://www.nimsme.gov.in వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ కె.సురేష్ కుమార్ సూచించారు.