తెలంగాణ ప్రజలు ఆమెను ఎన్నటికీ మరువరు…

కామారెడ్డి, ఆగష్టు 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి జిల్లా కార్యాలయంలో విదేశంగ శాఖ మాజీ మంత్రి, తెలంగాణ చిన్నమ్మ స్వర్గీయ సుష్మా స్వరాజ్‌ వర్ధంతి సందర్బంగా ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ నమ్మిన సిద్ధాంతానికి జీవితాంతం కట్టుబడి పని చేసిన సుస్మా స్వరాజ్‌ సేవలు మరవలేనివని కొనియాడారు.

ఇటు బీజేపీ పార్టీకి, అటు కేంద్ర మంత్రిగా దేశానికి ఎంతో సేవ చేసి లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలిగా సమర్ధవంతంగా పని చేశారని అన్నారు. తెలంగాణ ప్రజలు ఆమెను ఎప్పటికి మరవరని లోక్‌ సభలో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టినప్పుడు విద్యార్థి అమర వీరుల త్యాగాలను గుర్తు చేస్తూ ఆమె చేసిన ప్రసంగం ఉద్వేగంతో కూడుకున్నదని గుర్తు చేశారు. ఆమె చూపిన మార్గంలో నడుస్తూ ఆమె ఆశయాల సాధనలో బీజేపీ కార్యకర్తలు ఎప్పుడు ముందుంటారని అన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »