నిజామాబాద్, మే 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రెడ్‌క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా సేవలందిస్తున్న తోట రాజశేఖర్‌కు జాతీయ స్థాయిలో రెడ్ క్రాస్ అవార్డు వరించిన సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు రెడ్‌క్రాస్ జిల్లా శాఖ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను ప్రశంసించారు. జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న తోట రాజశేఖర్‌ను ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు. గత అనేక సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుండడం అభినందనీయమని కొనియాడారు.
ఈ సందర్భంగా వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో రూపొందించిన వడదెబ్బ నివారణ సూచనా పత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. ప్రజలలో అవగాహన పెంపొందించడంలో రెడ్ క్రాస్ కొనసాగిస్తున్న కృషిని ప్రశంసించారు. ప్రజలకు అత్యవసర సమయాల్లో బ్లడ్ డొనేట్ సేవలు అందిస్తున్నారని ప్రత్యేకంగా ప్రశంసించారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, నిజామాబాద్ ఏ.సి.పి రాజా వెంకట్ రెడ్డి, ఇంచార్జి ఆర్.డి.ఓ స్రవంతి, డి.పి.ఓ శ్రీనివాస్ రావు, డీ.ఎం.హెచ్.ఓ డాక్టర్ రాజశ్రీ, టీఎన్జీఓ ల సంఘం అధ్యక్షుడు సుమన్, కార్యదర్శి శేఖర్, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు , కోశాధికారి కరిపే రవీందర్ తదితరులు పాల్గొన్నారు.