కామారెడ్డి, మే 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
వరి ధాన్యం తూకంలో వ్యత్యాసం రాకూడదని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) అన్నారు. మంగళవారం లింగంపేట్ మండలం కోమటిపల్లి, పోతాయిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ పరిశీలించారు. ప్రస్తుతం వాతావరణ శాఖ సమాచారం మేరకు అకాల వర్షాలు కురిసే ఆస్కారం ఉందని, రైతులు ధాన్యం కుప్పలపై టార్పాలిన్ కప్పి వేయాలని తెలిపారు.
కొనుగోలు కేంద్రాల ఇంచార్జీలు టార్ఫాలిన్ లను అందుబాటులో ఉంచుకోవాలని, రైతులను అప్రమత్తం చేయాలని సూచించారు. ధాన్యం తూకాల్లో వ్యత్యాసం రాకుండా చూడాలని హమాలీలను ఆదేశించారు. కార్యక్రమంలో ఆయా కేంద్రాల ఇంచార్జీలు, రైతులు పాల్గొన్నారు.