ఎల్లారెడ్డి, మే 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
గత 20 సంవత్సరాల నుండి ఎల్లారెడ్డి నియోజకవర్గ పేదలు సొంత ఇంటి కల కలగనే మిగిలిపోయింది. గత ప్రభుత్వ పాలకుల అసమర్థపాలన వల్ల ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల వ్యవధిలోనే నియోజకవర్గానికి 3 వేల 500 డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు అయ్యాయి.
అందులో భాగంగా మంగళవారం ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని 7వ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పది మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అందజేశారు. పేదల ఇంటి కలను సాకారం చేసే దిశగా ముందడుగు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ ప్రజలకు సొంత ఇంటి ఉండడం ఒక కల. ప్రజలు అందరు తమకు సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటారు. ఈరోజు 10 మంది లబ్ధిదారులకు సొంత ఇంటి నిర్మాణం కొరకు భూమి పూజ చేసినందుకు, మంజురు పత్రాలను అందించినందుకు చాల సంతోషంగా ఉందన్నారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు, ఎల్లారెడ్డి మండల అధ్యక్షులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.