డిచ్‌పల్లి, మే 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ – (సి బి సి ఎస్) బి. ఏ./ బీ.కాం./ బి.ఎస్సి./ బి. బి. ఏ./ బి. సి ఎ. రెండవ, నాలుగవ, ఆరవ సెమిస్టర్ రెగ్యులర్, అలాగే ఒకటవ. మూడవ. ఐదవ సెమిస్టర్ బ్యాక్లాగ్ (2020 నుండి 2024 బ్యాచ్ లకు) పరీక్షలు శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి. ఉదయం జరిగిన పరీక్షలకు 7189 మంది విద్యార్థులకు 6709 మంది విద్యార్థులు హాజరయ్యారుకాగా 460 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు వర్సిటీ అధికారులు పేర్కొన్నారు.
మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 829 మందివిద్యార్థులకు 724 మంది విద్యార్థులు హాజరయ్యారు కాగా 108 మంది విద్యార్థులు గైరాజాలయ్యారని ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు.