కామారెడ్డి, ఆగష్టు 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలోని అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా వేడుకలు నిర్వహించినట్టు జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు అన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ ఆరు దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటిచెప్పిన మహోన్నతమైన వ్యక్తి అని తెలంగాణ ఉద్యమానికి స్పూర్తి ప్రదాత అని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ జాతిపిత అని నిస్వార్ధంగా, వివాహం చేసుకోకుండా జీవితాంతం ముల్కీ ఉద్యమం 1953 నుండి సకల జనుల సమ్మె వరకు తెలంగాణపై జరిగిన అన్యాయాన్ని, నష్టాలను ప్రత్యేక రాష్ట్రం కోసం భావజాల వ్యాప్తి, రచనలు చేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపిన గొప్ప వ్యక్తి అని అన్నారు.
ప్రతి ఒక్కరు ప్రొఫెసర్ జయశంకర్‌ని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన అడుగుజాడల్లో నడవాలని అన్నారు. కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం ప్రతినిధులు మెత్తల అనిల్, మోతే లావణ్య, రాజు, శ్రీను, నవీన్, తదితరులు పాల్గొన్నారు.