బృహత్‌ పల్లె ప్రకృతి వనంలో సోమవారం నుండి ప్లాంటేషన్‌

నిజామాబాద్‌, ఆగష్టు 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బృహత్‌ పల్లె ప్రకృతి వనంలో సోమవారం నుండి ప్లాంటేషన్‌ నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్సు హాల్‌ నుండి బృహత్‌ పల్లె ప్రకృతి వనం, బ ృహత్‌ పట్టణ ప్రకృతి వనం, హెల్త్‌ సర్వే, టిఎస్‌ బి పాస్‌., ఎస్సీ, ఎస్టీ వాడలలో మౌలిక సదుపాయాల సర్వేపై మున్సిపాలిటీ, మండల స్థాయి అధికారులతో మాట్లాడారు.

అన్ని మండలాలలో సోమవారం నుండి పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటాలని 31 వేల మొక్కల టార్గెట్‌ ఎంపీడీవోలు ఛాలెంజ్‌గా తీసుకోవాలని అప్రోచ్‌ రోడ్డు నీట్‌గా ఉండాలని పేనిషింగ్‌ ఏర్పాటు చేయించాలని, మంచి మొక్కలు 5 ఫీట్లకు తగ్గకుండా ఉండాలన్నారు. మీటరుకు ఒక మొక్క పల్లె ప్రకృతి వనంలో ఉండాలని, వీడియో తీసి సోమవారం వరకు పంపాలని పేర్కొన్నారు.

ప్రతి మండలంలో 15 ఆగస్టు వరకు పూర్తి కావాలి అన్నారు. ప్రభుత్వం అనుకున్నది రీచ్‌ కావాలన్నారు. ప్లాంట్స్‌ హెల్దీగా ఉండాలన్నారు. వెంటనే వాచ్‌ అండ్‌ వార్డ్‌ ఏర్పాటు పెట్టాలన్నారు. ఎన్‌హెచ్‌ 44 రోడ్డు ఏవిన్యూ ప్లాంటేషన్‌ ముప్కాల్‌, మెండోరా మండలాలు పెండిరగ్‌ ఉన్న ప్లాంటేషన్‌ వెంటనే పూర్తి చేయాలన్నారు. ఏవిన్యూ. ఇన్స్టిట్యూషన్‌ ప్లాంటేషన్‌ వందకు వంద శాతం పూర్తి కావాలన్నారు.

ఎన్‌హెచ్‌ 63 పెండిరగ్‌ లో ఉన్న ప్లాంటేషన్‌ వెంటనే పూర్తి చేయాలన్నారు. పిఆర్‌ ఆర్‌అండ్‌బి రోడ్స్‌లో ఉన్న గ్యాప్‌ ఫిల్లింగ్‌ పూర్తి చేసి మెయింటెనెన్స్‌ సరిగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. బోధన్‌, ఆర్మూర్‌, భీంగల్‌ మున్సిపాలిటీలలో బృహత్‌ పట్టణ ప్రకృతి వనం పూర్తి కావాలి అన్నారు. మున్సిపాల్టీలో లేఅవుట్‌ ఓపెన్‌ ప్లేస్‌లలో ప్లాంటేషన్‌ ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టవద్దు అన్నారు.

మున్సిపాలిటీలో 8 ఫీట్ల కన్నా తక్కువ మొక్కలు ఉండటానికి వీలు లేదన్నారు. సొంత ఫ్లాట్‌లో ఇల్లు కట్టుకోవడానికి టిఎస్‌ బి పాస్‌ ద్వారా 15 రోజుల్లో ప్లాట్‌ వెరిఫికేషన్‌కి వెళ్లి చూడాలన్నారు. అక్రమ కట్టడాలు ఉంటే తొలగించాలన్నారు. ఎస్సీ, ఎస్‌టి వాడల్లో ఇన్ఫర్మేషన్‌ సిసి రోడ్లు, డ్రైనేజీ విద్యుత్తు మిషన్‌ భగీరథ పై శనివారం అన్ని మండలాలలో వర్క్‌ స్టార్ట్‌ కావాలని మంగళవారం వరకు పూర్తిచేయాలని ఆదేశించారు.

వీక్లీ హెల్త్‌ సర్వే త్వరలోనే పూర్తవుతుందని అవసరం ఉన్న చోట సోమవారం కూడా నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ చిత్రా మిశ్రా, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఎఫ్‌డిఓ సునీల్‌, జడ్పీ సీఈవో గోవింద్‌, డిపిఓ జయసుధ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Check Also

డిగ్రీ కళాశాలలో యన్‌సిసి సంబరాలు

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »