కామారెడ్డి, ఆగష్టు 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై తీసుకోవలసిన చర్యలను శాఖల వారీగా ఆయన సమీక్షించారు.
హార్టికల్చర్, పల్లె ప్రగతి, ఆరోగ్యం, ఐసిడిఎస్, కళ్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ, మత్స్యశాఖ సంబంధించిన అధికారులు స్టాళ్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. విద్య శాఖ ఆధ్వర్యంలో మూడు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ డి.వెంకట మాధవరావు, ఆర్డిఓ శీను, డిపిఓ సునంద, జిల్లా అధికారులు పాల్గొన్నారు.