కామారెడ్డి, ఆగష్టు 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి జిల్లా కార్యాలయంలో సోమవారం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా పెట్టుబడి సాయంగా దేశంలోని రైతుల బ్యాంక్ ఖాతాల్లో 2 వేల రూపాయలు జమచేసిన సందర్బంగా జిల్లా రైతుల తరపున కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు అరుణ తార మాట్లాడుతూ రైతుల పక్షపాతి నరేంద్రమోడీ అని రైతులకు ఎల్లవేళలా అండగా ఉండే మోదీ ప్రభుత్వం 9వ విడత 2 వేల రూపాయల చొప్పున దేశ వ్యాప్తంగా 9.75 కోట్ల రైతు కుటుంబాల ఖాతాల్లో 19.500 కోట్లు జమ చేసిందని అన్నారు. ఈ పథకం ద్వారా జిల్లాలోని లక్షా 58 వేల కుటుంబాలకు 31.6కోట్ల రూపాయలు జమయ్యాయని అన్నారు.
రైతులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మూడు సాగుచట్టలను తీసుకు వచ్చిన మోదీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆమలు చేసి తీసుతుందని అన్నారు.