కామారెడ్డి, ఆగష్టు 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా దోమకొండ మండలానికి చెందిన బొరెడ్డి లలిత అనే మహిళ రక్త లేమితో స్థానిక కామారెడ్డి ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ బి పాజిటివ్ అవసరం ఏర్పడిరది. కాగా బిజెవైఎం రాష్ట్ర నాయకులు బండారి నరేందర్ రెడ్డిని ఫోన్లో వారి కుటుంబ సభ్యులు సంప్రదించారు.
కామారెడ్డి జిల్లా రక్తదాతల గ్రూప్ నిర్వాహకులు ఎనుగందుల నవీన్‌ను సంప్రదించగా మిత్రుడు బీజేపీ పట్టణ నాయకుడు నిట్టు రఘుపతి రావు స్వచ్చందంగా 12వ సారి రక్తదానం చేశారు.
రక్తదాన కార్యక్రమంలో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి, జిల్లా రక్తదాతల గ్రూప్ నిర్వాహకులు ఎనుగందుల నవీన్, బిజెవైఎం జిల్లా కార్యదర్శి, జిల్లా రక్తదాతల గ్రూప్ నిర్వాహకులు బోనగిరి శివ కుమార్, రోగి భర్త బొరెడ్డి రాజేందర్ రెడ్డి, రెడ్ క్రాస్ రక్త నిధి నిర్వాహకులు అమర్ తదితరులు పాల్గొన్నారు.