వేల్పూర్, ఆగష్టు 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూరు మండల కేంద్రంలోని పలు కాలనీలలో నీరు నిలిచిన ప్రదేశాల్లో, పెద్ద పెద్ద మురికి కాలువలో దోమల నివారణ చర్యల్లో భాగంగా దోమల లార్వా (గుడ్డు) ని నివారించేందుకు ఆయిల్ బాల్స్ వేశారు. అక్కడక్కడ నీరు నిలువ ఉన్న ప్రదేశాల్లో ఆయిల్ బాల్స్ వదిలారు.
ఇలా చేయడం వల్ల ఆయిల్ బాల్స్ నుండి ఆయిల్ అనేది విడుదల అయ్యి దాని యొక్క చమురు నీటి పైన ఒక చిన్న పొర లాగా ఏర్పడి దోమల యొక్క లార్వా పుట్టుక దశలోనే తొలగించ బడుతుందని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాధా మోహన్, గ్రామ పంచాయితీ సెక్రటరీ వినోద్ కుమార్ పరిశీలించారు.