కామారెడ్డి, ఆగష్టు 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర టిపిసిసి అధ్యక్షులు ఎనుమల రేవంత్ రెడ్డి స్వగృహంలో పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే విజయరమణ రావు మర్యాద పూర్వకంగా కలిశారు. అంతేగాక మాజీ ఎంపీపీ మాజీ జడ్పీటీసీ రాష్ట్ర గౌడ సంఘం నాయకులు గోపాగాని సారయ్య గౌడ్, జిల్లా మైనార్టీ నాయకులు మాజీ ఏఐఎంఐఎం జిల్లా అధ్యక్షులు సయ్యద్ మస్రత్ కూడా రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో ఉన్నారు.
త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వం ముస్లింలకు చేస్తునటువంటి అన్యాయాన్ని ప్రశ్నించవల్సిందిగా మస్రత్ని రేవంత్ రెడ్డి కోరారు. అలాగే రాబోయే రోజుల్లో విజయరామారావును ఎమ్మెల్యేగా గెలిపించి తీసుకురావాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యండి కలిమోద్దీన్, మాజీ కో ఆప్షన్ సభ్యులు సజ్జు ఉన్నారు.