డిచ్‌పల్లి, ఆగష్టు 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్. కోర్సుకు సంబంధించిన మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలు ఈ నెల 23 నుంచి 28 వరకు నిర్వహిస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు షెడ్యూల్ విడుదల చేశారు.
బి.ఎడ్. మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ ప్రాక్టికల్ పరీక్ష సెల్ఫ్- డెవెలప్ మెంట్ (ఇ పి సి -2) ఈ నెల 21 తేదీన నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. డిగ్రీ బి.ఎ., బి.కాం. బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్), కోర్సులకు సంబంధించిన రెండవ సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షల ఫీజు గడువు ఈ నెల 21 వ తేదీ వరకు ఉందని, 100 రూపాయల ఆలస్య అపరాధ రుసుముతో ఈ నెల 24 వరకు, 500 రూపాయల ఆలస్య అపరాధ రుసుముతో ఈ నెల 26 వరకు, 1000 రూపాయల అపరాధ రుసుముతో ఈ నెల 28 వరకు చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు.
ప్రీ – పిహెచ్.డి. ఆర్ట్స్, సోషల్ సైన్స్, సోషల్, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్, సైన్సెస్ ఫాకల్టీలలో గల సబ్జెక్ట్ లలోని రెగ్యూలర్, బ్యాక్ లాగ్ పరీక్షల ఫీజు గడువు ఈ నెల 16 వరకు ఉందని, 500 రూపాయల ఆలస్య అపరాధ రుసుముతో ఈ నెల 19 వరకు చెల్లించవచ్చని ఆయన అన్నారు. పరీక్షలను యూనివర్సిటి కాలేజ్ డిచ్‌పల్లిలో ఈ నెల 26, 27 తేదీలలో నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.