23 నుంచి పీజీ మొదటి సెమిస్టర్‌ పరీక్షలు

డిచ్‌పల్లి, ఆగష్టు 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ పీజీ కళాశాలలోని ఎం.ఎ., ఎం.ఎస్‌.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం.కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎల్‌. ఎల్‌. బి., ఎల్‌.ఎల్‌.ఎం., ఇంటిగ్రేటెడ్‌ కోర్సులకు చెందిన మొదటి సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలు ఈ నెల 23 నుంచి 30 వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు.

ఎం.ఎడ్‌. మొదటి, మూడవ సెమిస్టర్స్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షల ఫీజు గడువు ఈ నెల 17 వ తేదీ వరకు ఉందని, 100 రూపాయల అదనపు ఆలస్య అపరాధ రుసుముతో ఈ నెల 19 వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఎం. ఎడ్‌. మొదటి, మూడవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌, బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు ఈ నెల 23 నుంచి 26 వరకు నిర్వహిస్తున్నట్లు ఆయన రివైస్డ్‌ – షెడ్యూల్‌ విడుదల చేశారు. నిజామాబాద్‌ గిరిరాజ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎం.ఎడ్‌. పరీక్షాకేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లుగా సివోయి తెలిపారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »