బోధన్, ఆగష్టు 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జర్నలిస్టు బొర్రోళ్ల కృష్ణ కుటుంబాన్ని ఆదుకోవాలని దళిత జర్నలిస్టు ఫోరమ్ బోధన్ డివిజన్ కమిటీ ఎమ్మెల్యే షకీల్ అమీర్‌కి వినతిపత్రం అందజేశారు. సీనియర్ విలేఖరి బొర్రోళ్ల కృష్ణ రెండు రోజుల క్రితం గుండెపోటుతో మరణించడం బాధాకరమని వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇవ్వడం జరిగిందని దళిత జర్నలిస్ట్ ఫోరమ్ ప్రధానకార్యదర్శి గంధం రాజేష్ అన్నారు.
ఆయన కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇంటితో పాటు మరణించిన విలేఖరి భార్యకు ఏదైనా ఉద్యోగం కల్పించాలని డిజేఎఫ్ చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే షకీల్ తప్పకుండా అదుకుంటానని హామీ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వచ్చే ఆదివారం విలేఖరి కుటుంబాన్ని పరమర్శించనున్నట్టు ఈ సంధర్భంగా తెలిపారు.
కార్యక్రమంలో దళిత జర్నలిస్ట్ ఫోరమ్ ప్రధానకార్యదర్శి గంధం రాజేష్, గౌరవ అధ్యక్షులు అశోక్ కాంబ్లీ, ఉపాధ్యక్షులు నిమ్మల దిగంబర్, లక్ష్మీరాజు, కార్యదర్శి మోరే జీవన్, సాంస్కృతిక కార్యదర్శి కొండపల్లి నరేష్, సలహాదారులు పత్తి లాజర్, బెంగరి బాబు తదితరులు పాల్గొన్నారు.