గాంధారి, ఆగష్టు 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని గాంధారి గ్రామంలోని గుండమ్మ కాలువ రోడ్డు పనులను ఎమ్మెల్యే జాజాల సురేందర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గాంధారి గ్రామ అభివృద్ధిలో భాగంగా తన ప్రత్యేక నిధి నుండి 20 లక్షల రూపాయలు గుండమ్మ కాలువ రోడ్డు విస్తరణ పనులకు ఖర్చు పెట్టడం చాలా సంతోషంగా ఉందని అలాగే ఎల్లప్పుడూ గాంధారి గ్రామాభివృద్ధికి అందుబాటులో ఉంటానని అన్నారు. కార్యక్రమంలో గాంధారి మండల నాయకులతో పాటు గాంధారి గ్రామస్తులు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.