ఆర్మూర్, ఆగష్టు 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పట్టణ ప్రగతిలో భాగంగా హరిత హారం కార్యక్రమములో ఆర్మూర్ రెండవ వార్డులో ప్రధాన రోడ్లకు ఇరువైపుల మున్సిపల్ సిబ్బంది మొక్కలు నాటి ట్రీ గార్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్బంగా కౌన్సిలర్, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు సంగీతా ఖాందేష్ మాట్లాడుతూ పియుసి చైర్మన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్మూర్ ప్రాంతమంతా పచ్చగా చెట్లతో నిండాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా హరిత హారం కార్యక్రమం చేపట్టారని తెలిపారు.
ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, మన ఇంటి సమీపములో మున్సిపల్ వారు నాటిన మొక్కలను నీళ్లు పోయాలని కోరారు. కార్యక్రమములో తెరాస నాయకులు ఖాందేష్ సత్యం, మక్కల సంతోష్, ప్రశాంత్, నరేశ్, చంటి మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.