వేల్పూర్, ఆగష్టు 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా వేల్పూరు మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ భీమ జమున, వ్యవసాయ శాఖ కార్యాలయంలో, రైతు వేదికలో నరసయ్య, ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం కిరణ్ రవి, పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ రాజ్ భరత్ రెడ్డి, మండల రెవెన్యూ కార్యాలయంలో ఎమ్మార్వో సతీష్ రెడ్డి, మండల టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో బబ్బూర్ ప్రతాప్ రెడ్డి, వేల్పూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ తీగల రాధామోహన్, అంబేద్కర్ విగ్రహం వద్ద బహుజన సంఘ నాయకులు స్వామి రావు, బీమా ప్రసాద్ త్రివర్ణ పతాకాలు ఆవిష్కరించారు.
వివిధ గ్రామాల్లో సర్పంచులు, ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు జెండా ఆవిష్కరణ గావించి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్వతంత్రానికి ముందు భారతీయులు ఇంగ్లీష్ వారి నియంతృత్వ పాలనలో బానిసలుగ జీవించారని, స్వాతంత్రం కొరకు ఎందరో మహనీయులు మహాత్మా గాంధీ , సుభాష్ చంద్రబోస్ చంద్రశేఖర్ ఆజాద్ వంటి వారి బలిదానాలు, త్యాగల ఫలితంగా ఆగస్టు 15, 1947న స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. వారి త్యాగాలు మరువలేనివని అన్నారు. ప్రతి పౌరుడు వారి అడుగుజాడల్లో నడుస్తూ దేశ ప్రగతి కొరకు ముందుకు నడవాలని సూచించారు. కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు, పౌరులు యువకులు పాల్గొన్నారు.