కామారెడ్డి, ఆగష్టు 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటుచేసిన వివిధ స్టాళ్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ సందర్శించారు. వ్యవసాయ, ఉద్యాన, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ, సఖి కేంద్రం, ఆరోగ్యం, పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఆయిల్ ఫామ్ పంట సాగుపై ఉద్యానవన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ డి.వెంకట మాధవరావు, జిల్లా వైద్య అధికారి డాక్టర్ చంద్రశేఖర్, ఉద్యానవన అధికారి సంజీవ రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.