మాక్లూర్, ఆగష్టు 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా కిసాన్ మోర్చా మాక్లూర్ మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు నల్ల గంగా మోహన్ మాట్లాడుతూ రైతులకు ఏకకాలంలో లక్ష రపాయల రుణమాఫీ చేయాలని, అదేవిధంగా ఉచితంగా ఎరువులు అందజేయాలని, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తెలంగాణలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి గంగారెడ్డి, కిసాన్ మోర్చా మండల ఉపాధ్యక్షులు సుమన్, మండల బీజేపీ అధ్యక్షులు కాలగడ్డ వినోద్ కుమార్, ఎంపిటిసి కోటగిరి శ్రీనివాస్, బీజేపీ ప్రధాన కార్యదర్శి మదారి రాజు, గంగ మల్లు, రమేష్, శ్రీకాంత్, రవి గౌడ్, ధర్పల్లి పోశెట్టి, రవి కార్యకర్తలు పాల్గొన్నారు.