కామారెడ్డి, ఆగష్టు 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, మాజీ ప్రతిపక్ష నాయకులు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆదేశాల మేరకు మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు అధ్యక్షతన, కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్, పీసీసీ కార్యదర్శి మహమ్మద్ మసూద్ హైమద్ ముఖ్య అతిథిగా పాల్గొని బుధవారం జరగబోయే దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనేలా చేయాలని కోరారు.
దళిత గిరిజనులకు ప్రతి ఒక్కరికి దళిత బంధు పథకము అందాలని డిమాండ్ చేశారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో దళితులకు గిరిజనులకు అన్యాయం జరుగుతుందని, వారిని ఇంతవరకు ఏ పార్టీ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అదేవిధంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని, 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కల్లబొల్లి వాగ్దానాలు చెప్పి గద్దెనెక్కి అన్నిటినీ మర్చిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పండ్ల రాజు, పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గుడుకుల శ్రీనివాస్, జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు పాత శివ కృష్ణమూర్తి, షేరు, మాజీ కౌన్సిలర్లు గోనె శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు పంపర లక్ష్మణ్, సర్వర్, శంకర్, హైమద్, దాత్రీక సత్యం, రవి, ముకుందన్, రాజంపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు యాదవ రెడ్డి, ఆరేపల్లి సర్పంచ్ యాదగిరి, క్రిసీబుజ్, లక్క పతిని గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.