మోర్తాడ్, ఆగష్టు 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోర్తాడ్ మండల కేంద్రంలోని డిఆర్డిఏ ఐకెపిలో ధర్మోర సీసీగా పనిచేస్తున్న తడకల శ్రీనివాస్ 75 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం నిజామాబాద్ జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ సిసి అవార్డును అందుకున్నారు.
అంతాపూర్ గ్రామానికి చెందిన తడకల శ్రీనివాస్ గతంలో 2014 సంవత్సరంలో మొదటిసారి ఉత్తమ సీసీగా, 2019 సంవత్సరంలో రెండవ సారి జిల్లా ఉత్తమ సీసి గా ప్రశంసా పత్రం అందుకున్నారు. ప్రస్తుతం 2021 సంవత్సరంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, మంత్రి ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా సిసి శ్రీనివాస్ ప్రశంసా పత్రం అవార్డును అందుకోవడం పట్ల మోర్తాడ్ మండల అధికారులు మండల ప్రజలు అభినందనలు తెలిపారు.
మున్ముందు ఐకేపీలో చురుగ్గా పని చేస్తూ ఎన్నో ఉత్తమ అవార్డులు అందుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని సమాఖ్య కార్యాలయంలో సమాఖ్య సభ్యులు ఐకెపి సిబ్బంది ధర్మోరా సిసి తడకల శ్రీనివాస్‌ను అభినందించారు.