వేల్పూర్, ఆగష్టు 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం లాక్కోర 63 వ రహదారికి ఇరువైపుల నాటినమొక్కల ట్రీ గార్డులు, కర్రలను తొలగించిన వ్యక్తికి గ్రామపంచాయతీ కార్యదర్శి శ్వేత, అటవీశాఖ అధికారులు జరిమానా విధించారు. ఈ సందర్భంగా గ్రామ కార్యదర్శి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినహరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను పెరిగే విధంగా తెలంగాణ రాష్ట్రప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తుందని తెలిపారు.
రహదారి పక్కన నాటిన మొక్కల ట్రీ గార్డులను, కర్రలను తొలగించిన వ్యక్తికి 15 వేల రూపాయల జరిమానా విధించడం జరిగిందని తెలిపారు. గ్రామంలో నాటిన మొక్కలను ప్రతి ఒక్కరూ పెరిగే విధంగా కృషి చేయాలని సూచించారు. మొక్కలు ఎవరైనా తొలగించినట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.