టీయూకు ఎన్‌ఎస్‌ఎస్‌లో డిస్ట్రిక్ట్‌ గ్రీన్‌ చాంపియన్‌ అవార్డు

డిచ్‌పల్లి, ఆగష్టు 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎన్‌ ఎస్‌ ఎస్‌ (జాతీయ సేవా పథకం) కు స్వచ్చ యాక్షన్‌ ప్లాన్‌ (ఎస్‌ఏపి) ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్‌ గ్రీన్‌ చాంపియన్‌ అవార్డు 2020-21 సంవత్సరానికి గాను మహాత్మాగాంధీ కౌన్సిల్‌ ఆఫ్‌ రూరల్‌ ఎడ్యుకేషన్‌ ప్రదానం చేశారు. నిజామాబాద్‌ కలెక్టరేట్‌ అఫీస్‌లో అడిషనల్‌ కలెక్టర్‌ (లోకల్‌ బాడీస్‌) చిత్ర మిశ్ర తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌కి అవార్డును అందించారు. అవార్డులో భాగంగా సర్టిఫికేట్‌, 5 వేల రూపాయల నగదు పురస్కారాన్ని అందుకున్నారు.

ఈ సందర్భంగా అడిషనల్‌ కలెక్టర్‌ చిత్ర మిశ్ర మాట్లాడుతూ గురువారం తెలంగాణ విశ్వవిద్యాలయం అవార్డును అందుకోవడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) ద్వారా ఆరోగ్యవంతమైన క్యాంపస్‌ను, పచ్చదనం, పరిశుభ్రత పట్ల ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్ల ప్రోగ్రాం ఆఫీసర్స్‌, వాలంటీర్స్‌ ప్రత్యేక శ్రద్ధవహించి కార్యక్రమాలు చేశారు. జలశక్తి అభియాన్‌, గ్రామ సభలు, యాక్షన్‌ ప్లాన్‌ పాలసీ వంటి విషయాలలలో వాలంటీర్స్‌ పాల్గొనడమే గాక, అవగాహన ర్యాలీలు నిర్వహించారు.

ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ మాట్లాడుతూ విద్యార్థుల్లో మానవీయ విలువలు పెంపొంచడం, సామాజిక సేవా భాగంలో కృతక ృత్యులను చేయడం ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నామన్నారు. విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్‌ తరుఫున అవార్డును అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్‌ బృందం స్వచ్చ యాక్షన్‌ ప్లానింగ్‌ ద్వారా స్వచ్చ క్యాంపస్‌ స్కోరింగ్‌ సిద్ధం చేసుకొని కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నరు. ముఖ్యంగా వాటర్‌ మేనేజ్‌ మెంట్‌లో జల వనరుల పెంపును కలిగించే పద్ధతులను ఎన్నుకుని, వాటర్‌ బడ్జెట్‌ను, వాటర్‌ ప్లాన్‌ ను రూపొందించుకొని ముందుకు పోతున్నారన్నారు. ఆధునికతకు దూరంగా ఉన్న గ్రామాలను దత్తత తీసుకొని అనేక అంశాలలో అవగాహన కార్యక్రమాలను చేపట్టారని పేర్కొన్నారు.

రిజిస్ట్రార్‌ విద్యతో పాటుగా, సామాజిక సాంస్కృతిక అవగాహన కలిగించడమే గాకా, జాతీయ స్థాయిలో గెలుపొందిన విజయాలను తెలిపారు. తెలంగాణకు హరితహారంలో తెలంగాణ విశ్వవిద్యాలయం పచ్చని ప్రకృతితో వెలుగొందుతుందన్నారు. గ్రామాలలో పచ్చని మొక్కలు నాటడం వల్ల జిల్లాలు, తద్వారా రాష్ట్రం, దేశం పచ్చగా ఉంటుదని వివరించారు.

ఎన్‌ఎస్‌ఎస్‌ కో- ఆర్డినేటర్‌ డా.ప్రవీణాబాయి మాట్లాడుతూ తెలంగాణ విశ్వవిద్యలయంలోని జాతీయ సేవా పథకం ద్వారా నిర్వహించిన అనేక కార్యక్రమాలను గూర్చి తెలిపారు. ప్రధాన మంత్రి రూపొందించిన సంకల్పతరువు, స్వచ్చ పక్వాడా, జలశక్తి అభియాన్‌, హైజీన్‌ శానిటేషన్‌ వంటి కార్యక్రమాలను జిల్లా కలెక్టర్‌ వారితో కలిసి ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్స్‌ చేసిన విధులను వివరించారు.

అనంతరం మహాత్మాగాంధీ కౌన్సిల్‌ ఆఫ్‌ రూరల్‌ ఎడ్యూకేషన్‌ రీసోర్స్‌ పర్సన్‌ సంధ్య ఆన్‌లైన్‌ వర్క్‌ షాప్‌ నిర్వహించి, స్వచ్చ్‌ క్యాంపస్‌ యాక్షన్‌ ప్లాన్‌ 2021-22 గురించి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ చేశారు. స్వచ్చ్‌ క్యాంపస్‌ ఎలా ఉండాలో నమూనాగా ఒక విద్యా సంస్థలో వివిధ విభాగాలను పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ డా. ఎన్‌. సునీత తమ కాలేజ్‌ క్యాంపస్‌లో నిర్వహంచిన కార్యక్రమాలను గురించి తెలిపారు. ఇందులో ఎన్‌ఎస్‌ఎస్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ సురేష్‌, పిఆర్‌ఓ డా.వి.త్రివేణి, మాహాత్మాగాంధీ కౌన్సిల్‌ ఆఫ్‌ రూరల్‌ ఎడ్యుకేషన్‌ సిబ్బంది పద్మ, సాయి సుధీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 ఆదివారం, నవంబరు 24, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »