బాల్కొండ, ఆగష్టు 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది.
ప్రాజెక్టు గేట్లు ఏ సమయంలోనైనా తెరిచే అవకాశం ఉన్నందువల్ల గోదావరి నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా గొర్ల, బర్ల కాపరులు చేపల వేటకు పోయే వారు నది లోనికి వెళ్లరాదని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సూపరింటెండిరగ్ ఇంజనీర్ జి శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.