ఆర్మూర్, ఆగష్టు 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని సీవీఆర్ కళాశాలలో శుక్రవారం తెలంగాణ అల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆర్మూర్ డివిజన్ సర్వసభ్య సమావేశాన్ని బాబాగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా దత్తాత్రేయ, రామ్మోహన్ రావు, ఈవీఎన్ నారాయణ, ముత్తారం నరసింహ స్వామి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1-07-2018 నుండి పదవీ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్సీ రెండు సంవత్సరాలు నోష్నల్‌గా ఒక సంవత్సరం బెనిఫిట్‌తో ప్రభుత్వం అనాలోచిత చర్య తీసుకుందని, రెండు సంవత్సరాల్లో రిటైర్డ్ అయిన ఉద్యోగులు చాలా వరకు నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు.
తమకు హక్కుగా రావాల్సిన పీఆర్సీ ఉద్యోగులను మభ్యపెట్టి ఇవ్వకుండా ఉద్యోగులకు కడుపు కొట్టడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని, రిటైర్మెంట్ వయసు పెంచి మోసం చేశారని దుయ్యబట్టారు. నెలనెలా వచ్చే జీతాలు కూడా సరిగా రావడం లేదని, తెలంగాణలో అరాచక పాలన కొనసాగుతోందని, ఇది ఎన్ని రోజులో సాగదని, రాష్ట్ర ప్రభుత్వం అనవసరమైన విషయాలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వరంగ సంస్థల్ని, ఉద్యోగుల్ని అణగదొక్కే కార్యక్రమంలో భాగంగా పెన్షనర్స్‌కు గత ముప్పై రెండు నెలలుగా తాత్సారం చేసి ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీనిని ప్యాకేజీ అంటూ ఉద్యోగ ఉపాధ్యాయులను మభ్యపెట్టి ముప్పై శాతం ఫిట్మెంట్‌తో మూడు సంవత్సరాల వయోపరిమితి పెంచి ఉద్యోగుల, ఉపాధ్యాయుల మనోభావాలను దెబ్బతీశారని అన్నారు.
తాము తప్పకుండా ఈ విషయాన్ని కోర్టులో అప్పీల్ చేసి సాధించుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మల్లయ్య, గుమ్ముల గంగాధర్, మురహరి, రవినాథ్, రాఘవేంధర్, చంద్రశేఖర్, సత్యనారాయణ, సురేందర్, శ్రీనివాస్, నారాగౌడ్, కిషన్, గంగారెడ్డి, జింధం నరహరి, రమేష్, ఎల్‌టీ కుమార్, గంగాధర్ తదితర విశ్రాంత ఉద్యోగ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.