కామారెడ్డి, ఆగష్టు 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా నిరుద్యోగ యువకులకు ప్రయివేటు రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 23న సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు కలెక్టరేట్‌లోని మొదటి అంతస్తులోగల 121 వ గదిలో జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం కామరెడ్డిలో జాబ్ ఇంటర్వ్యూ నిర్వహించబడునని జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎస్.పబ్న ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్ నవతా ట్రాన్స్‌పోర్టు కంపెనీలో ఉపాధి కల్పించడం జరుగుతుందని, క్లర్క్ పోస్టుల ఉద్యోగాల కోసం విద్యార్హతలు ఇంటర్, డిగ్రీ చదివిన వారు అర్హులని, 18 నుంచి 30 సంవత్సరాలలోబడి వయసు ఉండాలన్నారు. హైదరాబాద్‌లో 70 ఖాళీలున్నాయని, అర్హత పొందిన అభ్యర్థులకు నెలకు 10 వేల 345 రూపాయల వేతనం ఉంటుందన్నారు.
అలాగే డ్రైవర్లు వెహికల్ క్లీనర్‌లకు ఎస్‌ఎస్‌సి చదివిన వారు 18 నుంచి 30 సంవత్సరాలలోపు వయసు ఉన్నవారు అర్హులన్నారు. హైదరాబాద్‌లో 50 ఖాళీలున్నాయని, అర్హత పొందిన అభ్యర్థులకు నెలకు 16 వేల 200 వేతనంతోపాటు బత్తా 145 రూపాయలు ఇస్తారన్నారు.
అదేవిధంగా ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ ఐటి, పోస్టుల కోసం ఏదైనా డిగ్రీ, 18 నుంచి 30 సంవత్సరాలలోపు వయసున్న వారు అర్హులన్నారు. హైదరాబాద్‌లో 3 ఖాళీలున్నాయని, అర్హత పొందిన వారికి నెలకు 13 వేల 95 నుంచి 25 వేల వరకు వేతనం ఉంటుందన్నారు.
ట్రయినీ హార్డ్‌వేర్, టెక్నికల్, హార్డ్‌వేర్ అండ్ టెక్నికల్ పోస్టుల కోసం ఏదైనా ఇంటర్, డిగ్రీ చదివిన వారు అర్హులని, 18 నుంచి 30 సంవత్సరాలలోపు వయసు ఉండాలన్నారు. హైదరాబాద్‌లో 15 ఖాళీలున్నాయని, అర్హత పొందిన వారికి నెలకు 10 వేల 345 నుంచి 12 వేల 95 రూపాయల వేతనం ఉంటుందన్నారు.
ఇంటర్వ్యూకు హాజరయ్యే వారు బయోడేటాతో పాటు విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు ఫోటోలతో రావాలని, మరింత సమాచారం కోసం 9032003244, 7671974009 నెంబర్లలో సంప్రదించాలన్నారు.