జిల్లా అధికారులు ప్రజావాణికి తప్పనిసరి హాజరు కావాలి

నిజామాబాద్‌, ఆగష్టు 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న సీజనల్‌ వ్యాధుల ప్రత్యేక డ్రైవ్‌ పూర్తి సమాచారం అందించేలా ఉండాలని ప్రజల ఆరోగ్యాలు కాపాడడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో జిల్లా అధికారుల సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా టియస్‌ ఐపాస్‌ టి ప్రైడ్‌ పాలసీ క్రింద 10 మంది లబ్ధిదారులకు అనుమతులు మంజూరు చేశారు. అందులో మోటార్‌ క్యాబ్‌ 2 , ట్రాక్టర్‌ ట్రైలర్‌ వెహికల్‌ 6 ,గూడ్స్‌ కరియాజ్‌ 2, ఎస్టీలకు 1 మోటార్‌ క్యాబ్‌, టి ప్రైడ్‌ పాలసీ క్రింద టియస్‌ పి 6 ట్రాక్టర్‌ ట్రైలర్‌ వెహికల్‌ 5, గూడ్స్‌ కరియాజ్‌ 1 మంజూరు చేశారు. జిల్లాలో ఉన్న డిగ్రీ కాలేజీలలో టాయిలెట్స్‌, డ్రిరకింగ్‌ వాటర్‌, కాంపౌండ్‌ వాల్‌ ఎలా ఉన్నవొ సమీక్షించారు.

డ్రిరకింగ్‌ వాటర్‌ లేని దగ్గర వెంటనే మిషన్‌ భగీరథ వాటర్‌ ఏర్పాటు చెయ్యాలని, జిజి కాలేజీలో జాబ్‌ మేల ఏర్పాటు చెయ్యాలని, అదేవిధంగా ప్రతి కాలేజీలో మొక్కలు నాటాలని ఆదేశించారు. కాలేజీలలో అడ్మిషన్‌ తక్కువ ఉన్న దగ్గర పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హరితహారం ఇచ్చిన టార్గెట్‌ పూర్తి కావాలని, మున్సిపల్‌లో చాలా తక్కువ ఉన్నందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కావున వారం రోజుల్లో పూర్తి కావాలని, లేకుంటే చర్యలు తీసుకోబడతాయన్నారు. మొక్కలు చెడిపోయిన దగ్గర వెంటనే వేరే మొక్కలు నాటాలని, మొక్కలు నాటిన తరువాత వాటరింగ్‌ ప్రతి రోజు చెయ్యాలన్నారు. ప్రతి మండలంలో ఒక మాడల్‌ గ్రామాన్ని తయారు చెయ్యాలని తెలిపారు. ప్రతి గ్రామంలో హెల్త్‌ క్యాంప్‌లు ఎలా జరుగుతున్నవి సంబంధిత అధికారులతో పరిశీలించారు. కావున జిల్లా అధికారులు స్పెషల్‌ అధికారులు ప్రతి గ్రామాన్ని తనిఖీ చెయ్యాలని, గ్రామంలో హరితహారం తో పాటు హెల్త్‌ క్యాంప్‌ ఎలా జరుగుతున్నది అదేవిధంగా గ్రామంలో జరుగుతున్న అన్ని పనులు పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

కోవిడ్‌ టెస్ట్‌లు 3 వేలు తగ్గకుండా చూడాలని, డెంగ్యూ, మలేరియా తదితర సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నందున వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మలేరియా, డెంగ్యూ వ్యాధుల పరీక్షలు జిజిహెచ్‌, పీహెచ్సీలో శాంపిల్‌ కలెక్షన్‌ చేసి రిపోర్టులు తీసుకొని అందుకు అనుగుణంగా వ్యాధిగ్రస్తులకు సత్వర చికిత్సలు అందించాలని పేర్కొన్నారు.

జిల్లా కార్యాలయాల్లో హైకోర్టు, లోకాయుక్త, హ్యూమన్‌ రైట్స్‌ నుంచి వచ్చిన పిటిషన్స్‌ పెండిరగ్‌ ఉంటే డిస్పోజ్‌ చేయాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్లు చిత్రా మిశ్రా, చంద్రశేఖర్‌, ఫారెస్ట్‌ అధికారి సునిల్‌, ఉషా విశ్వనాథ్‌ అడిషనల్‌ పోలీస్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ పాటిల్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »