వేల్పూర్, ఆగష్టు 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ బుధవారం నుండి శుక్రవారం వరకు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను, హోమం, ప్రత్యేక హారతి గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినట్టు వివరించారు. అనంతరం మంత్రి ప్రశాంత్ రెడ్డిని పూలమాల, శాలువాతో ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.