కామారెడ్డి, ఆగష్టు 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన వ్యాపారి జలిగామ సూర్య మోహన్ మానవత దృక్పథంతో ఆయుష్ బ్లడ్ బ్యాంకు నిజామాబాద్‌లో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీ వైద్యశాలలో రాములు అనే పేషెంట్‌కు ఐసియూ డెంగ్యూ వ్యాధితో బాధపడుతుడడంతో వారికి బీ పాజిటివ్ ప్లేట్లెట్స్ అవసరమని తెలియజేయడంతో వెంటనే స్పందించదం అభినందనీయమని అన్నారు.
ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ కరోనా సమయంలో కూడా రెండు యూనిట్ల ప్లాస్మాను అందజేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి ప్రాణాలు కాపాడిన సూర్య ప్రకాష్ ను అభినందించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తం కావాలంటే 9492874006 కు సంప్రదించాలని, వారికి దాతల సహకారంతో సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడుతామన్నారు. ఇప్పటికి 8 వేల 500 మందికి సకాలంలో రక్తాన్ని, 100 మందికి ప్లాస్మా ను అందించి ప్రాణాలను కాపాడడం జరిగిందన్నారు.