నిజామాబాద్, ఆగస్టు 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేషనల్ హైవే 63 పనులు త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం తన చాంబర్లో జిల్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కో – ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిజామాబాద్ నుండి ఆర్మూర్ వరకు ఎన్హెచ్ 63 పనులు 80 శాతం పూర్తి అయినందున మిగతా 20 శాతం రెండు రోజుల్లో పూర్తి చేసి వెంటనే నేషనల్ హైవే వారికి పొజిషన్ ఇవ్వాలన్నారు. మాణిక్ బండార్ సుఖ్జిత్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్న బ్రిడ్జి సర్వే సోమవారం వరకు పూర్తిచేయాలని సాలూరా టు నాగంపల్లి సర్వే పూర్తి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు చిత్రా మిశ్రా, చంద్రశేఖర్, ఆర్డీవో రవి కలెక్టరేట్ సూపరింటెండెంట్ రషీద్, ఈఈ నేషనల్ హైవే, ఆర్అండ్బి, ఎన్పీడీసీఎల్, ల్యాండ్ సర్వే తదితరులు పాల్గొన్నారు.