నిజామాబాద్, ఆగష్టు 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా స్థానిక కేర్ డిగ్రీ కళాశాలలో ఫుట్‌బాల్ క్రీడాకారులకు ఆట దుస్తులు, క్రీడా సామాగ్రిని నిజామాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రసేన్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి అందజేశారు. కేర్ ఫుట్‌బాల్ అకాడమీ ఏర్పాటు చేసిన జాతీయ క్రీడా దినోత్సవ వేడుకల్లో పలువురు అతిథులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి చంద్రసేన్ మాట్లాడుతూ క్రీడాకారులకు తులసి రెడ్డి తన వంతు సహకారంగా నాలుగు లక్షల రూపాయలతో క్రీడా సామాగ్రిని ఉచితంగ ఇవ్వడం గొప్ప విషయమని, తులసి రెడ్డి గత ఐదు సంవత్సరాల నుండి ప్రతి సంత్సరం దాదాపు రెండు లక్షల రూపాయలతో క్రీడాకారులకు ఉచితంగా క్రీడా సామాగ్రిని అందజేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ సంవత్సరం దాదాపు నాలుగు లక్షలు రూపాయల సామాగ్రి ఇవ్వడం ఆయన ఉదారతకు నిదర్శనమన్నారు. సబాధ్యక్షత వహించిన నిజామాబాద్ ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు శఖిల్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ఫుట్‌బాల్‌కు కేర్ ఆఫ్ అడ్రస్‌గ కేర్ ఫుట్‌బాల్ అకాడమీ మారిందని, కేర్ ఫుట్‌బాల్ అకాడమీ నుండి ఒక అంతర్జాతీయ క్రీడాకారిణి గుగులోత్ సౌమ్య దాదాపు 20 మంది జాతీయ క్రీడాకారులు తయారు కావడం గొప్ప విషయం అన్నారు.
కేర్ ఫుట్‌బాల్ అకాడమీ ఇంతగా ఎదగడానికి ముఖ్య కారణం కోచ్ నాగరాజు అని కేర్ ఫుట్‌బాల్ అకాడమీ అధ్యక్షులు నరాల సుధాకర్ అన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు కోచ్ నాగరాజు ఫుట్‌బాల్ క్రీడకు చేస్తున్న సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త వేద్ ప్రకాష్, ఘనపురం దేవేందర్, శంభుని గుడి చైర్మన్ మహేందర్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.