సెప్టెంబర్‌ 3న దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ…

నిజామాబాద్‌, ఆగష్టు 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కమ్మర్‌ పల్లి మండలంలో సెప్టెంబర్‌ 3వ తేదీన నిర్వహించే దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడు మరియు దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా బాల్కొండ సమన్వయకర్త బల్మూరి వెంకట్‌ పిలుపునిచ్చారు. ఆదివారం కమ్మర్‌పల్లి మండలం ఊఫ్లూర్‌ గ్రామం కమ్యూనిటీ భవనంలో జరిగిన కార్యక్రమంలో బల్మూరి వెంకట్‌ మాట్లాడారు.

దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభల ప్రాముఖ్యతను వివరిస్తూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు తెరాస ప్రభుత్వం 2014 నుండి దళితులను ఏ విధంగా మోసం చేసిందో వివరించడానికే దళిత ఆత్మగౌరవ దండోరా సభల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దీని ద్వారా ప్రతి నియోజకవర్గస్థాయి లోని ప్రతి దళితుని ఇంటింటికీ వెళ్లి దళితులను తెరాస ప్రభుత్వం మోసం చేస్తున్న తీరును ఎండగడుతూ ఆ మోసాన్ని వారికి తెలియజేస్తామన్నారు.

గతంలో కెసిఆర్‌ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నాడని అలాగే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని మోసం చేశాడని, ఇప్పుడు హుజురాబాద్‌ ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అక్కడ దళిత సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నందున వారిని మభ్య పెట్టి వారి ఓట్లు దండుకొని హుజురాబాద్‌లో గెలిచిన తర్వాత వారిని మోసం చేయాలని ముఖ్య ఉద్దేశంతోనే తెరాస ప్రభుత్వం దళిత బంధు అనే మోసపూరితమైన కార్యక్రమంతో దళితుల ముందుకు వచ్చిందని బల్మూరి వెంకట్‌ ఆరోపించారు.

అలాగే దళిత బంధు కార్యక్రమం కేవలం హుజురాబాద్‌లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళితులు అందరికీ ఏకమొత్తంగా అమలు చేయాలని ఆయన ఈ సందర్భంగా తెరాస ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఏలేటి గంగాధర్‌, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పి రెడ్డి శీను, తక్కురీ దేవేందర్‌, మండల అధ్యక్షులు సుంకేటి రవి, జిల్లా మైనారిటీ సెల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అబ్దుల్‌ రఫీ, నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు వరద బట్టు వేణురాజ్‌, కిసాన్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు పడిగెల ప్రవీణ్‌, యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు బోనగిరి భాస్కర్‌, ఎస్సి సెల్‌ జిల్లా కార్యదర్శి పత్రి రవీందర్‌, నాయకులు సాయి వరుణ్‌, వేదమిత్ర, అభిలాష్‌, అఖిల్‌, శశి, చరణ్‌, చింటూ, తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »