నిజామాబాద్, ఆగష్టు 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ గ్రౌండ్‌లో జిల్లా క్రీడల శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి ముత్తన్న అతిథిగా హాజరయ్యారు. ముందుగా ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ గౌరవ సూచికగా ఆయన పుట్టిన రోజైన ఆగస్టు 29న 116 వ జన్మదినం జరుపుకుంటున్నామన్నారు.
ఈ సందర్భంగా హాకీ, హ్యాండ్ బాల్, బాక్సింగ్, పుష్, ఆటల పోటీలు నిర్వహించారు. ధ్యాన్ చంద్ 1923, 1932, 1936 మూడు సార్లు భారత్ ఒలింపిక్‌లో బంగారు పతకాలు తీసుకు రావడం జరిగిందన్నారు. క్రీడాకారులు ఒక ఆటలో రాణించాలంటే ఆట చిట్ట చివరి వరకు కూడా సాధన చేసి నేషనల్ ఇంటర్నేషనల్‌కు వెళ్లాలని చెప్పి కోరుకుంటున్నానన్నారు.
మన జిల్లా నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడిన క్రీడాకారులున్నారని, ఎండల సౌందర్య హాకీ, ఉజామ్ ఉద్దీన్ బాక్సింగ్, సౌమ్య ఫుట్‌బాల్ ఇంటర్నేషనల్ సెలక్షన్ అయ్యారని, మంచి నైపుణ్యం నేర్చుకొని ఉన్నతమైన స్థానంలో ఉండాలని అన్నారు. అనంతరం క్రీడా కారులకు, శిక్షకులకు అవార్డును ఇచ్చి గౌరవించారు. కార్యక్రమంలో లింగన్న కబడి సెక్రెటరీ, సాయగౌడ్, మొహమ్మద్ యాసిన్ నాగరాజ్ ఫుట్ బాల్ కోచ్ తదితరులు పాల్గొన్నారు.