నిజామాబాద్, ఆగస్టు 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో రెండు, మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడంతోపాటు అధికారులను అప్రమత్తం చేసి అవసరమైన చర్యలు తీసుకోవడానికి కలెక్టరేట్లోను, విద్యుత్ శాఖలోనం కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు.
కంట్రోల్ రూమ్లు 24 గంటల పాటు పనిచేస్తాయని అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు కానీ, అధికారులు కానీ భారీ వర్షాలకు సంబంధించిన అవసరమైన సమాచారం అందించాలని తద్వారా సంబంధిత శాఖల అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
కలెక్టరేట్ 08462 220183
ఎలక్ట్రిసిటీ 94408 11600