బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా అబ్బగోని అశోక్‌ గౌడ్‌

నిజామాబాద్‌, ఆగష్టు 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా అబ్బగోని అశోక్‌ గౌడ్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రాష్ట్ర అధ్యక్షులు మేకపోతు నరేందర్‌ గౌడ్‌ తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో అశోక్‌ గౌడ్‌కు నిజామాబాద్‌ అధ్యక్షుడిగా నియామక పత్రాన్ని అందించారు.

ఈ సందర్భంగా అశోక్‌ గౌడ్‌ మాట్లాడుతూ ఇటువంటి అవకాశాన్ని కల్పించిన తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మేకపోతు నరేందర్‌ గౌడ్‌కి, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బొల్లం లింగ మూర్తి పటేల్‌, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు దేవరకొండ నరేష్‌ చారికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పథకం కింద దళితులకు 10 లక్షలు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా బీసీలకు కూడా బిసి బంధు పథకం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

దళితులకు దళిత బంధు పథకాన్ని స్వాగతిస్తున్నామని, అదే అదేవిధంగా హుజురాబాద్‌ నుండే తెలంగాణా రాష్ట్ర బీసీ బంధు కూడా కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా జిల్లాలో త్వరలో అన్ని మండలాల నుంచి మండల కమిటీలు వేస్తామని తెలిపారు. మండలం నుండి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బీసీ కులాలను, కుల వృత్తులను ప్రోత్సహిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాద్యక్షులు బొబ్బిలి నర్సయ్య , ఆర్గనైజేషన్‌ సెక్రటరీ ఊట్నూర్‌ సత్యగౌడ్‌, మీడియా కన్వీనర్‌ బీ.ఆర్‌ నర్సింగ్‌ రావు, నిజామాబాద్‌ యువజన బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఉప్పు నూతల రాజాగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »