నిజామాబాద్, ఆగష్టు 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్‌లోని పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయంలో మంగళవారం జగిత్యాల అర్బన్, రూరల్ మండలాలకు సంబంధించిన కుల సంఘాల ప్రతినిధులు పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్‌ను కలిశారు. ఈ సందర్భంగా సంఘాల ప్రతినిధులు వారి వారి కమ్యూనిటీ హాలులకు సంబంధించిన ఆర్థిక నిధులు మంజూరు చేయాలని కోరారు.
కార్యక్రమంలో రాష్ట్ర మున్నురు కాపు సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు వొడ్నాల రాజశేఖర్, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు మారుపాక రాజేందర్, ఏకలవ్య ఎరుకుల సంక్షేమ సంఘం నాయకులు సంక్షేమ సంఘ నాయకులు దాసరి పోచయ్య, చిరం భగవంతం, దాసరి కిషన్, దాసరి వెంకటేష్ ఉడుత నరసిములు, మోతే రెడ్డి సంఘం నాయకులు నారాయణ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రామ్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, మున్నూరు కాపు సంఘం నాయకులు జంగిలి చంద్రమౌళి, జంగిలి ఓంకార్, సూర్య కిరణ్, రాజ్ కుమార్, శివ కుమార్, గంగాధర్, శేఖర్, వెంకటేష్ వెంకటేష్ ప్రవీణ్ శ్రీనివాస్ అశోక్ రజక సంఘం నాయకులు ఎడవెల్లి భూమేష్ తదితరులు పాల్గొన్నారు.