Breaking News

తండ్రి జ్ఞాపకార్థం

వేల్పూర్‌, సెప్టెంబర్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండల కేంద్రంలో మండల ప్రాథమికఆరోగ్య కేంద్రంలో మొండి నవీన్‌ వారి తండ్రి బాలయ్య జ్ఞాపకార్థం ఎమర్జెన్సీ బెడ్‌, వీల్‌ చైర్‌, సుక్షన్‌ యూనిట్‌ తెమడతీయు యంత్రాన్ని విరాళంగా అందజేసినట్టు డాక్టర్‌ అశోక్‌ తెలిపారు.

ఈ సందర్భంగా డాక్టర్‌ అశోక్‌ మాట్లాడుతూ మొండి నవీన్‌ తండ్రి మొండి బాలయ్య జ్ఞాపకార్థం ఎమర్జెన్సీ పరికరాలను అందజేయడం అందరికి ఆదర్శమని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, ఏప్రిల్‌.5, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »